యువతను మత్తు నుంచి విడిపించమే లక్ష్యంగా... | - | Sakshi
Sakshi News home page

యువతను మత్తు నుంచి విడిపించమే లక్ష్యంగా...

Apr 6 2026 9:24 AM | Updated on Apr 6 2026 9:24 AM

గంజాయి, డ్రగ్స్‌ బారిన పడిన యువతను కాపాడడమే లక్ష్యంగా పోలీస్‌ శాఖ పనిచేస్తోంది. జిల్లాలో గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణపై ప్రత్యేక దృష్టి సారించాం. నార్కోటిక్‌ టీమ్‌ పని చేస్తుంది. గంజాయి విక్రేతలు పద్ధతి మార్చుకోవాలని కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నాం. మారనివారిపై పీడీయాక్ట్‌ నమోదు చేస్తున్నాం. ఇప్పటికే 300 మందిపై సస్పెక్ట్‌ షీట్‌ నమోదు చేశాం.

– ఎగ్గడి భాస్కర్‌, డీసీపీ, మంచిర్యాల

మత్తుకు బానిస కావొద్దు

యువత గంజాయి, మద్యం, గుడుంబా, ఇతర డ్రగ్స్‌కు బానిస కావొద్దు. మత్తులో నేరాలకు పాల్పడే అవకాశం ఉంది. మత్తుకు బానిసైన వారిని డీ అడిక్షన్‌ సెంటర్‌కు తీసుకువస్తే ఉచితంగా వైద్యం అందిస్తాం. మానసిక వైద్యుల కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. మంచిర్యాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

– డాక్టర్‌ రామ్‌నాయక్‌, మానసిక వైద్యనిపుణుడు, జీజీహెచ్‌, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement