శ్రీరాంపూర్: సమసమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుద్ధవనం ప్రాజెక్టు అధికారి, సీడీఎస్ చైర్‌పర్సన్ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. ఇటీవల సుబ్రహ్మణ్యం, బోధివర్ధన్ అవార్డులు అందుకున్న ఆయనతో పాటు మాతా రమాబాయి అవార్డు అందుకున్న ఆయన సతీమణి మల్లేపల్లి జయకు ఆదివారం సీసీసీలోని సింగరేణి గెస్టుహౌజ్ సమావేశ మందిరంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో సన్మానించారు. ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రజల జీవనం కష్టతరంగా మారిందన్నారు. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలదేవి, బీసీ లైజన్ అధికారి, ఏరియా ఎస్‌ఓటు జీఎం సత్యనారాయణ, దళిత్ బహుజన ఫ్రంట్ ఫౌండర్ వినయ్‌కుమార్, సీఐ ప్రవీణ్‌కుమార్, సింగరేణి అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, నిర్వాహక కమిటీ కన్వీనర్ గోషిక మల్లేశ్, నాయకులు నాగేశ్వర్‌రావు, సమ్మయ్య, శ్రీనివాస్, సంపత్, లక్ష్మణ్, బుచ్చయ్య, రవి, ప్రవీణ్, శ్యాం, రాజేశ్, కుమార్, అధికారులు ఆనంద్‌కుమార్, గుండె రావు పాల్గొన్నారు.


