చెన్నూర్: పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట ముందస్తు సమాచారం, అనుమతులు లేకుండా గుంపుగా చేరి ప్రజారవాణాకు ఆటంకం కలిగించడం, దిష్టిబొమ్మ దగ్ధం చేయడంతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్వీ నాయకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు.బీఆర్‌ఎస్వీ నాయకులు బడికెల శ్రావణ్, నాయబ్, శ్రీనివాస్, నవీన్, సంపత్, శివ, మహేందర్‌లపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఎవరైనా చట్టవ్యతిరేక, ప్రజాశాంతికి భంగం కల్గించే విధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.


