మంచిర్యాలటౌన్: బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరిలో సోమవారం జరుగనున్న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆ దివారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రే మ్‌సాగర్‌రావు పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు పెద్దఎత్తున పాల్గొని సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


