మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం దృష్ట్యా మ్యాపింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలతో ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఓటర్ల మ్యాపింగ్, బూత్ స్థాయి అధికారుల శిక్షణ, బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి బూత్ స్థాయి ఏజెంట్ల నియామకం జరిగేలా కృషి చేయాలని తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 63శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయిందని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, శ్రీనివాస్‌రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.


