సమగ్ర గిరిజనాభివృద్ధికి కృషి | - | Sakshi
Sakshi News home page

సమగ్ర గిరిజనాభివృద్ధికి కృషి

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

● ఐటీడీఏ పీవో యువరాజ్‌ మర్మాట్‌ ● డిప్యూటీ కలెక్టర్లతో సమావేశం

ఉట్నూర్‌రూరల్‌: సమగ్ర గిరిజనాభివృద్ధికి ఐటీడీఏ కృషి చేస్తోందని పీవో యువరాజ్‌ మర్మాట్‌ పేర్కొన్నారు. శుక్రవారం ఉట్నూర్‌ ఐటీడీఏ కార్యాలయ సమావేశ మందిరంలో రెండురోజుల క్షేత్ర పర్యటనకు వచ్చిన 20 మంది డిప్యూటీ కలెక్టర్లతో సంక్షేమ పథకాల అమలు, గిరిజనులకు కల్పిస్తున్న వి ద్య, వైద్యం, గిరిజనులు, పీవీటీజీలకు అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అధికార యంత్రాంగం సమన్వయంతో సమర్ధవంతంగా అమలు చేస్తూ అర్హులకు లబ్ధి చేకూరుస్తున్నామని చెప్పారు. అనంతరంఐటీడీఏ ఉద్యాన అధికారి గుడిమళ్ల సందీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఐటీడీఏ పరిధిలోని ఉద్యాన నర్సరీ, శిక్షణ కేంద్రాన్ని డిప్యూటీ కలెక్టర్లు సందర్శించారు. నర్సరీలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలను సందీప్‌కుమార్‌ వివరించారు. వివిధ రకాల పండ్ల తోటల పెంపకం, సాగులో మెళకువలు, అంటుకట్టే విధానం, కొమ్మలు కత్తిరించే విధానం, ఎరువుల వినియోగం, నీటి యాజమాన్యం, కూరగాయల నారు పెంపకం, వేసవిలో పండ్లు, కూరగాయల పెంపకంలో తీసుకోవాల్సిన జా గ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం ఉట్నూర్‌ పరిధిలోని ప్రభుత్వ ఆ స్పత్రిని సందర్శించి వైద్యసేవలు, మందుల నిల్వ లు, ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, విద్యాబోధన తీరు, విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement