మంచిర్యాలఅగ్రికల్చర్: మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 317వ వర్ధంతి వేడుకలు గురువారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భాగ్యవతి, వివిధ శాఖల జిల్లా అధికారులు, బీసీ సంఘాల ప్రతినిధులు పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తురుష్క సైనికులకు వ్యతిరేకంగా వీరోచిత పోరాటం చేశారని, రాజ్యాధికార సాధనపై ప్రజల్లో చైతన్యం కలిగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి ఎన్.శ్రీనివాస్, బీసీ సంఘాల ప్రతినిధి కె.లచ్చన్న, గౌడ సంఘం రాష్ట్ర ప్రతినిధి ముఖేష్‌గౌడ్ పాల్గొన్నారు.
నేడు దొడ్డి కొమురయ్య జయంతి
మంచిర్యాలటౌన్: కలెక్టరేట్‌లో ఈ నెల 3న దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.భాగ్యవతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే కార్యక్రమానికి అధికారులు, ప్రజలు హాజరు కావాలని కోరారు.


