రెబ్బెన: మండలంలోని మాద్వాయిగూడ సమీపంలో గల జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టులో గల్లంతైన యువకుడి మృతదేహం గురువారం లభ్యమైనట్లు ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు. కాగజ్‌నగర్‌కు చెందిన అర్ఫజ్ బేగ్ (21) బుధవారం తన స్నేహితులైన గౌస్, కిరణ్, సాయి, జిబిల్‌తో కలిసి ఈత కొట్టేందుకు జగన్నాథ్‌పూర్ ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. అందరూ కలిసి నీటిలో దిగగా అర్ఫజ్ నీటమునిగాడు. ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో ప్రాజెక్టులో గాలించారు. రాత్రయినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో గురువారం తెల్లవారు జామున తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. మృతుని మేనమామ మహ్మద్ నౌషద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాలి
పాతమంచిర్యాల: ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం కోసం అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ శ్రీనివాస రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 18 నుంచి 25 సంవతర్సాల వయస్సు కలిగి ఎస్సెస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లోమా, డిగ్రీ/ పీజీ చదువుతున్న విద్యార్థుఽలు అర్హులన్నారు. ఎంపికై న వారికి 6–9 నెలల పాటు ఇంటర్న్‌షిప్ పొందే అవకాశం ఉంటుందని నెలకు రూ.9వేల స్టైఫండ్, రూ.6 వేల గ్రాంట్ అందిస్తారన్నారు. ఆసక్తి కలవారు http/pminternship.mca.gov.in. వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం 1800 116 090 నంబరులో లేదా కలెక్టరేట్‌లోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.
స్థలం ఆక్రమించిన నలుగురిపై కేసు
ఆదిలాబాద్‌రూరల్: తప్పుడు పత్రాలు సృష్టించి అక్రమంగా స్థలాన్ని ఆక్రమించిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు మావల ఎస్‌హెచ్‌ఓ రాహుల్ కాంత్ (ఐపీఎస్) తెలిపారు. మావల పోలీస్‌స్టేషన్ పరిధిలోని దస్నాపూర్ సర్వే నం.1లో ప్లాట్ నం.20లో మంద జయనారాయణ రెడ్డికి చెందిన స్థలాన్ని మైసర్ల లక్ష్మి, సిరిపురం రమాదేవి, ప్రసన్న, రాణి ఆక్రమించారు. బాధితుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మైసర్ల లక్ష్మిని అరెస్టు చేయగా, మిగితా ముగ్గురు పరారీలో ఉన్నారు.


