మంచిర్యాలఅగ్రికల్చర్: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం మంచిర్యాల నగరంలోని తాళ్లపల్లి, సింగాపూర్, గుత్తేదారుపల్లి ప్రాంతాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్‌తో కలిసి పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి పనుల అమలు తీరును పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆండాళమ్మ కాలనీ డంపింగ్ యార్డులో బయో మైనింగ్ పనులు పూర్తయ్యాయని, ఈ ప్రాంతంలో త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి
నెన్నెల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య సూచించారు. మంగళవారం మండలంలోని నెన్నెల, గుండ్లసోమారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల పనులను పరిశీలించారు. గుండ్ల సోమారంలో అంగన్వాడీ కేంద్రం, హైస్కూల్‌ను తనిఖీ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం శిథిలావస్థలో ఉన్నందున నూతన భవనం కోసం నివేదికలు సిద్ధం చేయాలని డీపీవో వెంకటేశ్వర్లును ఫోన్‌లో ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ హై, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్‌లు ఇబ్రహీం, సింగతి రాణి, కార్యదర్శులు సురేష్, రంజీత్ పాల్గొన్నారు.


