బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సత్తయ్య | - | Sakshi
Sakshi News home page

బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా సత్తయ్య

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

మంచిర్యాలక్రైం: జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొత్త సత్తయ్య ఎన్నికయ్యారు. స్థానిక బార్‌ అసోసియేషన్‌ హాల్‌లో మంగళవారం ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు ఎన్నికల కమిషనర్‌ మదన్‌మోహన్‌ పర్యవేక్షణలో కార్యవర్గం ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష స్థానానికి రంగు మల్లేశం, అనిల్‌రాజ్‌్‌, కొత్త సత్తయ్య పోటీ పడ్డారు. బార్‌ అసోసియేషన్‌ సభ్యులుగా 378 మంది ఓటర్లు ఉండగా.. 328 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్ల లెక్కింపు ఉత్కంఠ మధ్య సాగింది. సత్తయ్యకు 224 ఓట్లు రాగా, అనిల్‌రాజ్‌కు 81 ఓట్లు వచ్చాయి. అనిల్‌రాజ్‌పై కొత్త సత్తయ్య 143 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

కార్యవర్గం..

జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా కొత్త సత్తయ్య, ఉపాధ్యక్షురాలుగా టీ.మంజుల, ప్రధాన కార్యదర్శిగా ఆవునూరి సత్తయ్య, సంయుక్త కార్యదర్శిగా జీ.మాధవిలత, కోశాధికారిగా అల్లం శ్రీనివాస్‌, లైబ్రరీ కార్యదర్శిగా సుధమల్ల శివరామకృష్ణ, మహిళా ప్రతినిధిగా పి.రజిని, స్పోర్ట్స్‌, కల్చరల్‌ సెకెట్రరీగా జి.రమణరెడ్డి, కార్వర్గ సభ్యులుగా జీ.లక్ష్మీ ప్రసన్న, ఎన్‌.సుమలత, పీ.శ్రీకాంత్‌, ఎస్‌.మల్లేష్‌, ఎస్‌.ప్రదీప్‌చంద్ర, ఏ.జయపాల్‌రెడ్డి, కే.నటేశ్వర్‌ ఎన్నికై నట్లు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement