బెల్లంపల్లి: నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని బెల్లంపల్లి ఏసీపీ వి.కిరణ్‌కుమార్ అన్నారు. మంగళవారం పద్మశాలి భవన్‌లో పోలీసుల ఆధ్వర్యంలో అరైవ్–అలైవ్ కార్యక్రమంలో భాగంగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కంటివైద్య నిపుణుడు అంజయ్య, వన్‌టౌన్ ఎస్‌హెచ్‌ఓ కె.శ్రీనివాసరావు, బెల్లంపల్లి రూరల్ సీఐ సీహెచ్.హనోక్, పోలీసు సిబ్బంది, లయన్స్‌క్లబ్ అధ్యక్షురాలు అరుణసుందరి పాల్గొన్నారు.
కంటి పరీక్షను పరిశీలిస్తున్న ఏసీపీ కిరణ్‌కుమార్


