ఖానాపూర్: తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో ప్రతిభ కనబర్చిన గిరిజన క్రీడాకారులకు అరుదైన అవకాశం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆశ్రమ, క్రీడా పాఠశాలల విద్యార్థులను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌కు విహారయాత్రకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యార్థులు జూపార్క్, లుంబిని పార్క్‌ను సందర్శించారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. విహారయాత్ర సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌తో విద్యార్థులు ఫొటోలు దిగారు. కాగా, 2025–26 సంవత్సరానికి నిర్వహించిన సీఎం కప్ క్రీడాపోటీల్లో జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు ఖో–ఖో, ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్ విభాగాల్లో ప్రతిభ కనబర్చి బంగారు, వెండి పతకాలు సాధించిన విషయం తెలిసిందే.


