భీమిని: మండలంలోని రాజారం గ్రామానికి చెందిన దుర్గం విజయ్‌కుమార్ (45)పై అదే గ్రామానికి చెందిన దుర్గం దేవాజీ దాడి చేయగా గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎస్సై కొటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజారం గ్రామానికి చెందిన విజయ్‌కుమార్, దేవాజీలు వ్యక్తిగత కారణాలతో మార్చి 25న దూషించుకున్నారు. ఇదే క్రమంలో మాటామాట పెరగడంతో పరస్పరం కొట్టుకున్నారు. ఈ ఘటనలో విజయ్‌కుమార్‌కు మెడ భాగంలో గాయాలయ్యాయి. దీంతో అతడిని కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి కూతురు ఉంది.


