చెన్నూర్‌రూరల్: మండలంలోని కొమ్మెర గ్రామానికి చెందిన మేడగోని జ్యోతి (50) విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జ్యోతి మంగళవారం ఉతికిన దుస్తులు ఇంటిముందున్న రేకుల షెడ్డు కింద ఇనుప తీగపై ఆరేసే క్రమంలో ప్రమాదవశాత్తు దానికి విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. 20 ఏళ్ల క్రితమే జ్యోతి భర్త వెంకటస్వామి మృతి చెందాడు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. ఎంతో కష్టపడి ఇద్దరు కూతుళ్లకు వివాహాలు చేసింది. కొడు కు హరికృష్ణ ఆటో నడుపుతూ అమ్మకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. చిన్న తనంలోనే తండ్రిని, ఇప్పుడు తల్లిని కో ల్పోయారు. పోస్టుమార్టం ని మిత్తం మృతదేహాన్ని చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ బన్సీ లాల్ తెలిపారు.


