ఆదిలాబాద్: ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మంగళవారం ఢిల్లీలో మహారాష్ట్ర ఉప ము ఖ్య మంత్రి ఏకనాథ్ షిండే తనయుడు, ఎంపీ శ్రీ కాంత్ షిండేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని మహారాష్ట్ర సరిహ ద్దు వడూర్ వద్ద పెన్‌గంగా నదిపై బ్రిడ్జి నిర్మాణానికి ఉన్న ఆవశ్యకత గురించి ఆయనతో చ ర్చించారు. ఈ విషయంపై సానుకూలంగా స్పందించిన శ్రీకాంత్ షిండే త్వరలోనే అధి కారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ అంశాన్ని ప్ర భుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీతోపాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గంగాధర్‌రావు ఉన్నారు.


