బెల్లంపల్లి డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సు | - | Sakshi
Sakshi News home page

బెల్లంపల్లి డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సు

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

అందుబాటులోకి వచ్చిన బీఏ హానర్స్‌ వచ్చే విద్యాసంవత్సరం నుంచి షురూ మల్టీ జోన్‌–1లో ఈ ఒక్క కాలేజీలోనే.. ఒకే సబ్జెక్ట్‌ మూడేళ్లపాటు చదివే ఛాన్స్‌ పేద విద్యార్థులకు ఎంతో ప్రయోజనం

బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకుంది. డిగ్రీలో ఒకే సబ్జెక్ట్‌ను స్పెషలైజేషన్‌గా మూడేళ్లపాటు చదివే అద్భుత అవకాశం విద్యార్థులకు దక్కబోతోంది. 2026–27 విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సు విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. తెలంగాణలోని మల్టీజోన్‌–1 పరిధిలో ఈ కోర్సు కలిగిన ఏకై క కళాశాలగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రత్యేకత ఏర్పర్చుకుంది. ఉన్నత విద్యావ్యవస్థలో వినూత్నమైన మార్పులు తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించేలా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా కొత్త కోర్సులకు రూపకల్పన చేసి ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ప్రతిష్టాత్మకమైన బీఏ హానర్స్‌ కోర్సు కేటాయించినట్లు ప్రిన్సిపాల్‌ కాంపల్లి శంకర్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీ యూనివర్సిటీ, సెంట్రల్‌ యూనివర్సిటీల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ కోర్సు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బెల్లంపల్లి విద్యార్థులకు చేరువ కానుండడం శుభపరిణామంగా చెప్పవచ్చు.

వీరికే ప్రవేశార్హత

బీఏ హానర్స్‌ కోర్సులో చేరడానికి ఇంటర్‌ తత్సమా న కోర్సులతోపాటు పాలిటెక్నిక్‌ డిప్లొమా చేసిన వి ద్యార్థులు కూడా అర్హులు. ఇంటర్‌లో హెచ్‌ఈసీ, సీ ఈసీ, బైపీసీ, ఎంపీసీ కోర్సులతో పాటు ఒకేషనల్‌ చదవిన విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. అన్ని రకాల కోర్సుల విద్యార్థులు చదవగలిగే సబ్జెక్ట్‌ను బీఏ హానర్స్‌ డిగ్రీలో ఎంచుకోవచ్చు. ఒకే సబ్జెక్ట్‌ను స్పెషలైజేషన్‌గా తీసుకుని మూడేళ్లపాటు చదవడం ద్వారా ఆ సబ్జెక్ట్‌లో అత్యుతన్నతమైన పట్టు సాధించే అవకాశం కలగనుంది. అంతటి ప్రత్యేకమైన కో ర్సు కేవలం బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ద క్కించుకుని అరుదైన ఘనత సాధించడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement