సుందరమైన ‘దువ్వెన బాతు’ | - | Sakshi
Sakshi News home page

సుందరమైన ‘దువ్వెన బాతు’

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

జన్నారం: ఈ చిత్రంలో కనిపించే బాతు గడ్డితో కూడిన మంచినీటి కొలనులు, కుంటలు, నదుల్లో నివసించే వలస పక్షి. మగ బాతుల్లో ముక్కు మీద దువ్వెన లాంటి నిర్మాణం ఉండడంతో వీటిని కోంబ్‌ డక్స్‌ లేదా నాబ్‌ బిల్డ్‌ డక్స్‌ అంటారు. దువ్వెన బాతు, జుట్టు చిలువ అని స్థానిక భాషలో పిలుస్తా రు. ఇవి సుదూర ప్రయాణాలు చేస్తాయి. కొన్ని ప క్షులు మూడున్నర వేల కిలో మీటర్లకు పైగా ప్రయాణిస్తాయి. గడ్డి విత్తనాలు, నీటిలో పెరిగే మొక్కలు, కీటకాలు, చిన్న చేపలు, కప్పలు వీటి ఆహారం. ఇవి భారత ఉపఖండ దేశాలు, మియన్మార్‌లో వ్యాపించి ఉన్నాయి. కొన్ని ఆఫ్రికా దేశాలు, దక్షిణ అమెరికా దేశాల్లోనూ వ్యాపించి ఉన్నాయి. ఇవి గరిష్టంగా 30 ఏళ్ల వరకు జీవిస్తాయి. ఈ బాతులు కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ జన్నారం డివిజన్‌లోని కిష్టాపూర్‌ చెరువులో కనిపించగా ఎఫ్‌డీవో రామ్మోహన్‌ కెమెరాలో బంధించి వాటి వివరాలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement