పెన్షన్‌ వ్యాలిడేషన్‌ చట్టం రద్దు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షన్‌ వ్యాలిడేషన్‌ చట్టం రద్దు చేయాలి

Mar 26 2026 7:35 AM | Updated on Mar 26 2026 7:35 AM

నిర్మల్‌చైన్‌గేట్‌: కేంద్రప్రభుత్వం పెన్షనర్లకు తీవ్ర నష్టాన్ని కలిగించే పెన్షన్‌ వ్యాలిడేషన్‌ చట్టం 2025 తక్షణమే రద్దు చేయాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంసి లింగన్న అన్నారు. బుధవారం పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పెన్షనర్ల సంఘ భవనం నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌కు వి నతిపత్రం అందజేశారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గొజ్జ జనార్దన్‌, జిల్లా బాధ్యులు లోలం గంగన్న, డాక్టర్‌ నాగేశ్వరరావు, కరీం, కూన పోశెట్టి, డాక్టర్‌ రజిని, రామాగౌడ్‌, రాజేశ్వర్‌, యూనిట్‌ బాధ్యులు రమేశ్‌, జనార్దన్‌, బాలకిషన్‌, జగదీశ్వర్‌, రాములు, బొడ్డు లక్ష్మణ్‌, జాప రాములు, పోతన్న, వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement