దండేపల్లి: చేపలు పట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మత్స్యకారుడు మృతిచెంది నట్లు ఎస్సై తహసీనొద్దీన్ తెలిపారు. ఆయన కథ నం ప్రకారం..మండలంలోని పెద్దపేటకు చెందిన మత్స్యకారుడు నర్ముల లింగయ్య(64) బుధవారం తోటి మత్స్యకారులతో కలిసి గ్రామంలోని ఎర్రకుంటలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఈక్రమంలో కుంటలో చేపలకు విసిరిన వల నీ టిలో పిచ్చిమొక్కలకు తట్టుకు ంది. దాన్ని బయటకు లాగే క్ర మంలో నీటిలో బోల్తాపడిపోయాడు. గమనించిన తోటి మ త్స్యకారులు అతన్ని బయట కు తీసేసరికి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందాడు. మృతుడి భార్య లచ్చవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.


