లక్ష్మణచాంద: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై గోపి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. సోన్ మండలం పాక్‌పట్లకు చెందిన బండారి శ్రీను (36) మంగళవారం రాత్రి గ్రామ శివారు వద్ద కుంచెపు నానితో ఉన్నారు. గాంధీనగర్ గ్రామానికి చెందిన ఆమ్లె వెంకటేశ్, శంకర్ బైక్‌పై అతివేగంగా వచ్చి శ్రీనును ఢీకొట్టారు. ఆమ్లె వెంకటేశ్, శంకర్ స్వల్పంగా, శ్రీనుకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్సులో నిర్మల్ ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ బుధవారం శ్రీను మృతిచెందాడు. మృతుడి భార్య సరిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.


