ఉట్నూర్‌రూరల్: ఉట్నూర్ పరిధిలో గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాల ఏర్పాటుతో ఫలితాలు సాధిస్తున్నామని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మట్ అన్నారు. ఉట్నూర్ కొమురం భీమ్ కాంప్లెక్స్ క్రీడా మైదానంలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి గిరిజన ఆదర్శ క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల ఎంపిక కోసం వివిధ క్రీడాపోటీలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పాఠశాల ద్వారా ఎంతోమంది విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకాలు సాధించారని తెలిపారు. ఏపీవో (పీవీటీజీ) భాస్కర్, ఏజెన్సీ డిప్యూటీ ఈవో గొడం చందన్, జిల్లా గిరిజన క్రీడల అధికారి కె.పార్థసారథి, ఏటీడీవో సదానందం, ప్రధానోపాధ్యాయులు ఉత్తం, శ్రీనివాస్, రవీందర్, శిక్షకులు పాల్గొన్నారు.


