నర్సాపూర్(జి): మహిళా (నారీశక్తి) పోలీసుల చొరవతో మండల కేంద్రంలోని వారసంతలో తప్పిపోయిన బాలుడిని తల్లి చెంతకు చేర్చారు. జిల్లా కేంద్రంలోని గొల్లపేట్‌కు చెందిన సంగీత తన నాలుగేళ్ల కుమారుడు సిద్దూతో కలిసి బుధవారం నర్సాపూర్ (జి)లోని బంధువుల ఇంటికి వచ్చింది. తల్లితో కలిసి వారసంతకు రాగా, బాలుడు తప్పిపోయాడు. నారీశక్తిలో భాగంగా విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసులు షహన భాను, వినితకు బాలుడు ఏడుస్తూ కనిపించాడు. అతడితో మాట్లాడి తల్లి కోసం వెతికిన దొరకలేదు. బాలుడిని పోలీస్‌స్టేషన్ తీసుకెళ్లి ఆహారం అందించారు. బాలుడి ఆచూకీ తెలుసుకున్న తల్లి పోలీస్‌స్టేషన్‌కు రాగా, అతన్ని అప్పగించారు. ఎస్పీ జానకి షర్మిల ఈ సందర్భంగా పోలీసులు అభినందించారు.


