మట్టికుండ నీళ్లు ఆరోగ్యానికి ఔషధం
మంచిర్యాలఅర్బన్: వేసవి కాలంలో శరీరానికి అవసరమైన పోషకాలు, చల్లదనాన్ని అందించడంలో మట్టికుండ నీరు దివ్యౌషధంగా పనిచేస్తుందని జిల్లా అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) చంద్రయ్య అన్నారు. జిల్లా సైన్స్ కేంద్రంలో శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మట్టిపాత్రలు, మట్టి గణప తి వినియోగంపై అవగాహన, మట్టి కుండల తయారీ కార్యశాల నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి 50 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇటీవల రాష్ట్రస్థాయి, సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులు గంప శ్రీనివాస్, జాడి ప్రవీణ్‌ను అదనపు కలెక్టర్ మెమొంటోలతో సత్కరించారు. డీఈవో యాదయ్య, డీఎస్‌వో రాజగోపాల్, సెక్టోరల్ అఽధికారులు సత్యనారాయణమూర్తి, చౌదరి, విజయలక్ష్మీ, రాజ్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల సహాయ సంచాలకుడు మల్లేషం, సమన్వయ కర్త రాజన్న, పాఠశాల హెచ్‌ఎం బండి రమేష్ పాల్గొన్నారు.


