ప్రతీ సమస్య మొదట తెలిసేది సర్పంచ్‌కే
గ్రామంలోని ప్రతి సమస్య మొదట తెలిసేది ఆ గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్‌కే. సర్పంచ్‌లు నేరుగా రాష్ట్రస్థాయి, దేశస్థాయి వరకు కూడా తెలియజేసే అవకాశం ఉంటుంది. నేను 2000 సంవత్సరం నుంచి 2005 వరకు జైనథ్ మండలంలోని అడ గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యాను. ఉత్తమ గ్రామపంచాయతీగా రాష్ట్రపతి ద్వారా అవార్డును ప్రణబ్ ముఖర్జి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. కంప్యూటరీకరణ చేపట్టడం జరిగింది. ప్రస్తుతం గ్రామపంచాయతీకి నిధులు తక్కువగా వస్తున్నాయి. నేను సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో తాగునీటి సమస్యను పరిష్కరించాను. ఇంటింటికీ నల్లా, మరుగుదొడ్లు ఏర్పాటు చేయించాను. గ్రామంలోని భూముల కొలతలు చేయించి రికార్డులు తయారు చేయడం జరిగింది. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు ఎంపీటీసీగా, ఆ తర్వాత 2000 నుంచి 2005 వరకు సర్పంచ్‌గా, 2006 నుంచి 2009 వరకు ఎంపీటీసీగా, 2010లో జెడ్పీటీసీగా ఎన్నికయ్యాను. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను. గ్రామ అభివృద్ధి చేసిన వారికి సర్పంచ్‌గా మంచి గుర్తింపు ఉంటుంది.
– పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే


