బైక్‌ను ఢీకొట్టిన లారీ
జైనథ్: బైక్‌ను వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఘటనలో హెడ్ కానిస్టేబుల్ గాయపడ్డారు. ఎస్సై గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం నిరాల నుంచి జైనథ్ పోలీస్‌స్టేషన్‌కు హెడ్ కానిస్టేబుల్ గౌరీ అశోక్ బైక్‌పై వస్తుండగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా అంతర్రాష్ట్ర రహదారిపై లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో హెడ్ కానిస్టేబుల్ చేతికి బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. కాగా లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.


