ముంపు బాధితులకు పరిహారం | - | Sakshi
Sakshi News home page

ముంపు బాధితులకు పరిహారం

Oct 15 2025 6:28 AM | Updated on Oct 15 2025 6:28 AM

ముంపు

ముంపు బాధితులకు పరిహారం

దేవులవాడలో వివరాల సేకరణ

నేడు కోటపల్లిలో రెండో విడత

హర్షం వ్యక్తం చేస్తున్న కాళేశ్వరం

బ్యాక్‌వాటర్‌ బాధిత రైతులు

చెన్నూర్‌: కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో వేలాది ఎకరా ల్లో పంటలు నీట మునిగి నష్టాల పాలవుతున్న రై తులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకువచ్చింది. ఇందుకు రూ.33.50కోట్లు మంజూరు చే యగా, ప్రస్తుతం రూ.10 కోట్లు విడుదలయ్యాయి. వీటిని రెండు నెలల్లో రైతులకు పరిహారం కింద పంపిణీ చేసేలా ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్‌ను కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంకటస్వామి ఆదేశించారు. దీంతో ఐదేళ్ల పాటు వరద ముంపుతో బి క్కుబిక్కు మంటూ కాలం వెల్లదీస్తున్న కొందరు రై తులు ప్రభుత్వ నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తుండగా మరికొందరు ఆందోళన చెందుతున్నారు.

గతంలో అధికారుల తప్పిదాలు

కాళేశ్వరం బ్యాక్‌ వాటర్‌తో ఐదేళ్లకు పైగా చెన్నూర్‌, కోటపల్లి, వేమనపల్లి, జైపూర్‌ మండలాల్లోని వేలా ది ఎకరాల పంటలు సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారు. బ్యాక్‌ వాటర్‌ ముంపు గ్రామాల ఎంపికలో అప్పటి ఇంజినీరింగ్‌ అధికారుల తప్పిదాలతో వీరికి ఈ దుస్థితి తలెత్తింది. వరద ముంపు సర్వేలో కొన్ని గ్రామాలనే పరిగణనలోకి తీసుకున్నారు. చె న్నూర్‌, కోటపల్లి, జైపూర్‌ మండలాల్లోని 950.22 ఎ కరాలకే పరిహారం ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో కోటపల్లి, వేమనపల్లి, చెన్నూర్‌ మండలాల రైతులకు తీవ్రంగా నష్టం జరిగే ప్రమాదముంది.

దేవులవాడలో 264 ఎకరాలకు..

కోటపల్లి మండలం దేవులవాడ శివారులోని 264 ఎకరాల పంట చేన్లకు ప్రభుత్వం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇటీవల చెన్నూర్‌లో జరిగి న సమావేశంలో బ్యాక్‌ వాటర్‌ బాధితులకు డిసెంబర్‌లో పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వివేక్‌ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసిన విష యం తెలిసిందే. దీంతో రెవెన్యూ అధికారులు దేవులవాడలో రైతుల వివరాలు సేకరిస్తున్నారు. మంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వంతో మాట్లాడి పరిహారం పంపిణీ వ్యవహారాన్ని కొలిక్కితెచ్చారు.

నాడు చెన్నూర్‌, జైపూర్‌లో..

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భాగంగా కాళేశ్వరం బ్యారేజ్‌ నుంచి సుమారు 52కిలో మీటర్ల మేరకు చెన్నూర్‌, జైపూర్‌, కోటపల్లి మండలాల్లోని నష్టపో యే పంట భూములను అధికారులు గుర్తించారు. 2016లో చెన్నూర్‌, జైపూర్‌ మండలాల్లోని 692.22 ఎకరాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. ఇందులో చెన్నూర్‌ మండలం సుందరశాల, సర్సక్కపేట, పొక్కూర్‌ గ్రామాల్లోని భూములకు ఎకరాకు రూ.8.40 లక్షల చొప్పున రైతులకు పరిహారం చెల్లించారు. సుందరశాలలోని మరో ఆరెకరాలకు రూ.4.60 లక్షల చొప్పున పరిహారం అందజేశారు. చెన్నూర్‌ మండలంలోని భీరెల్లి, నాగపూర్‌, సోమనపల్లి, జైపూర్‌ మండలం శివ్వారం గ్రామాల భూములకు రూ.10.60 లక్షల చొప్పున అందజేశారు.

ముంపు గ్రామాలివే..

చెన్నూర్‌ మండలంలోని వెంకంపేట, నారాయణపు రం, చెన్నూర్‌లోని గోదావరి పరిహార ప్రాంతం, శివలింగాపూర్‌, కోటపల్లి మండలంలోని రాంపూర్‌ రాపన్‌పల్లి, అన్నారం, వెంచపల్లి, కోల్లూరు, వెంచపల్లి గ్రామాలున్నాయి. ఈ గ్రామాల రైతులు మూ డో విడత పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు.

రెండో విడతకు కసరత్తు

ప్రాజెక్ట్‌ బ్యాక్‌ వాటర్‌తో ముంపునకు గురయ్యే భూములను గుర్తించిన అప్పటి ప్రభుత్వం చెన్నూర్‌, జైపూర్‌ మండలాల రైతులకు పరిహా రం ఇచ్చి చేతులు దులుపుకొంది. ప్రాజెక్ట్‌ ముంపులో కోటపల్లి మండలం ఉన్నప్పటికీ పరిహా రం ఇవ్వలేదు. మంత్రి వివేక్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. పరిహా రం అందించేలా కృషి చేశారు. దీంతో రెండో విడత పరిహారం పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కోటపల్లి మండలం దేవులవాడ శివారులో 264 ఎకరాలు, 80 మంది రైతులను గుర్తించారు. పరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు రెండురోజులుగా రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఎకరాకు రూ.12.50 లక్షలు ఇచ్చేందుకు గతంలో భూములు పరిశీలించిన అధికారులు తెలిపినట్లు రైతులు పేర్కొన్నారు.

ఐదేళ్లుగా నష్టపోతున్న

నాది కోటపల్లి మండలంలోని అన్నారం. నాకు 11ఎకరాల భూమి ఉంది. ఏటా కాళేశ్వరం వరద ముంపుతో పంట నీట మునిగి ఏడాదికి రూ.మూడు లక్షల వరకు నష్టపోతున్న. రెండో విడత దేవులవాడకు పరిహారం ఇస్తున్నరు. మూడో విడతలోనైనా మాకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలి.

– గొడిసెల శశిపాల్‌రెడ్డి, రైతు, అన్నారం

మాకెప్పుడిస్తరు

ఏటా ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చేది. ఈ సారి 4నుంచి 5క్వింటాళ్లు కూడా వస్తలేదు. నాలుగేళ్ల నుంచి అప్పులపాలయ్యా. ఈ ఏడాది నిండా ముంచింది. బ్యారేజీ నిర్మించి నుంచి పంటలు దెబ్బతింటున్నయ్‌. ప్రభుత్వం భూములు స్వాధీనం చేసుకుని పరిహారం ఇవ్వాలి.

– మేకర్తి రాజేశ్‌, రైతు, రాంపూర్‌

ముంపు బాధితులకు పరిహారం1
1/2

ముంపు బాధితులకు పరిహారం

ముంపు బాధితులకు పరిహారం2
2/2

ముంపు బాధితులకు పరిహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement