
కాకో ఆలయం వద్ద భక్తుల సందడి
దండేపల్లి: తెలంగాణలోనే ఏకై క ఆలయంగా ప్రసిద్ధి చెందిన మండలంలోని గుడిరేవు గోదావరి నది ఒ డ్డునున్న ఆదివాసీల ఆరాధ్యదైవం శ్రీపద్మల్‌పురి కా కో ఆలయంలో దండారీ ఉత్సవాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా ఆలయానికి భక్తుల తాకి డి పెరగింది. మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి ఆదివాసీలు అధికసంఖ్యలో తరలివచ్చారు. కాకోను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో గుస్సాడీల నృత్యాలు ఎంతగానో అలరించాయి. రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి కాకోను దర్శించుకుని పూజలు చేశారు.
కాకోను దర్శించుకుంటున్న రాష్ట్ర చైర్మన్ తిరుపతి
నృత్యం చేస్తున్న గుస్సాడీలు

కాకో ఆలయం వద్ద భక్తుల సందడి