
రేపు ఏఐసీసీ పరిశీలకుడి రాక
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: డీసీసీ(జిల్లా కాంగ్రెస్ కమిటీ) అధ్యక్ష పదవికి ఎంపిక కోసం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కాంగ్రెస్ క మిటీ ఏఐసీసీ పరిశీలకులు డాక్టర్ నరేశ్‌కుమార్ తన కార్యాచరణ ప్రారంభించారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌తో సహా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరా ల సురేఖను కలిశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న నేపథ్యంలో ఆయనను కలవలేకపోయారు. ఈ మేరకు జిల్లాలో డీసీసీ అధ్యక్ష ఎంపిక కోసం నాయకుల అభిప్రాయ సేకరణతో సహా పార్టీ నాయకులకు జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న వారితో ఒక్కొక్కరితో మాట్లాడే విధంగా షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 16న మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కార్యకర్తలతో ముఖ్య సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు ఫారాలు అందజేస్తారు. అదే రోజు మీడియా సమావేశం నిర్వహిస్తారు. 17న కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఫారెస్ట్ గెస్ట్‌హౌజ్ వద్ద ఆ జిల్లా అధ్యక్ష పదవి కోసం దరఖాస్తు చేసుకున్న నాయకు లతో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడతారు. అదే రోజు మధ్యాహ్నం బెల్లంపల్లి నియోజకవర్గ నాయకులతో, 18న చెన్నూర్ నియోజకవర్గ నాయకులతో, 19న మంచిర్యాల జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న వారితో విడివిడిగా మాట్లాడనున్నారు. 20న హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.