
అమ్మో.. పులి
భీమిని: మండలంలోని చిన్నతిమ్మాపూర్ తంగెళ్లపల్లి మధ్యలోగల ఎర్రవాగు సమీపంలో పులి అడుగులు కనబడటంతో స్థానికులు భ యాందోళనకు గురవుతున్నారు సోమవా రం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహెగాం బిబ్రా, పెసరికుంట గ్రామాల సమీపంలోని పంట చేలలో పులి పాదముద్రలు కని పించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి నుంచి మంగళవా రం భీమిని మండలం వైపు రావడంతో గ్రా మస్తులు భయాందోళన చెందుతున్నారు. దీంతో అటవీశాఖ అధికారులు స్పందించి పులి బారి నుంచి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.