
విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు
మంచిర్యాలఅగ్రికల్చర్: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, సంక్షేమ శాఖ అధికారులతో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలను కలెక్టర్లు నిరంతం పర్యవేక్షించాలని, విద్యార్థులకు అందిస్తున్న బోధన, ఆరోగ్యం, భోజనం, ఇత ర మౌలిక వసతుల అమలు గురించి తెలుసుకోవా లని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఆటంకం లే కుండా బోధన కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ.. జిల్లాలో బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై సంబంధిత శాఖల అధికా రులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. బో ధన, ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించాలని, ఆ యా పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. డీఈవో యాదయ్య, సంక్షేమశాఖల అధికారులు దుర్గాప్రసా ద్, నీరటి రాజేశ్వరి, పురుషోత్తం తదితరులున్నారు.