
పత్తిచేలపై అడవిపందుల దాడి
కోటపల్లి: నాగంపేట గ్రామ శివారులోని పత్తి పంటలపై సోమవారం అడవిపందులు దాడి చే సి ధ్వంసం చేశాయి. రైతులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించగా పరిశీలించేందు కు వచ్చిన అధికారుల దృష్టికి తమ సమస్యల ను తీసుకవెళ్లారు. అడవిపందులను చంపితే కే సులు పెడతామని హెచ్చరించే ఆధికారులు పంటలు నాశనం చేస్తే మరి మా పరిస్థితి ఏంట ని ఆందోళనకు దిగారు. ఎస్సై రాజేందర్ వ్యవసాయాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు సద్దుమణిగారు. వ్యవసాయాధికారి సాయికృష్ణ, ఏఈవో వైష్ణవి పంటలను పరిశీలించి పంచనామా నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. అనంతరం రైతులు తహసీల్దార్ రాఘవేందర్‌రావుకు వినతిపత్రం ఇచ్చారు.