
పదోన్నతులు ఇప్పించింది పీఆర్టీయూనే
● యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి
నస్పూర్: స్కూల్ అసిస్టెంట్లకు పీజీహెచ్‌ఎంలుగా, ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదో న్నతులు ఇప్పించిన ఘనత తమదే అని పీఆర్టీ యూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దామోదర్‌రెడ్డి అన్నారు. సీసీసీలోని ఎంఎం గార్డెన్‌లో ఆదివా రం నిర్వహించిన జిల్లా సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్‌తో కలిసి పాల్గొన్నారు. గురుకుల టీచర్ల టైం టేబుల్ సమస్య పరిష్కరిస్తామని, పెండింగ్ డీఏ బిల్లులు త్వరగా చెల్లించేలా, ఎంప్లాయిమెంట్ హెల్త్ స్కీం అమలయ్యేలా కృషి చేస్తామన్నారు. ఉపాధ్యాయులకు టెట్ నిబంధనను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించామన్నారు. అనంతరం పదోన్నతి పొందిన వారిని సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు కొట్టె శంకర్, ప్రధా న కార్యదర్శి బచ్చ మోహన్‌రావు, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, రాష్ట్ర అసోసియేట్ సభ్యులు ప్రసాద్, సాంబమూర్తి, సత్యనారాయణ, జిల్లా నాయకులు కుమారస్వామి, రమణారెడ్డి, రాజన్న, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.