
రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ కలయిక
మంచిర్యాలరూరల్(హాజీపూర్): 1976లో ప్రారంభమైన కుష్ఠు నివారణ కేంద్రం అర్ధ శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని జిల్లాలోని ఆ విభాగాలకు చెందిన రిటైర్డ్ ఉద్యోగుల కలయిక జిల్లాలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలోని నలుమూలల నుంచి 60 నుంచి 80 ఏళ్ల వయస్సు గల రిటెర్డ్ ఉద్యోగులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి ఆనందోత్సాహాల మధ్య గడిపారు. ముందుగా దివంగత ఉద్యోగులకు శ్రద్ధాంజలి ఘటించారు. ఈ వేడుకలో రిటైర్డ్ ఉద్యోగి యూ.రామేశ్వరచారి బృందం నిర్వహించిన సంగీత విభావరిలో సందడి చేశారు. వైద్యాధికారులుగా పని చేసిన సూర్యారావు, విజయవాణిలను సన్మానించారు.