
వైన్స్ తరలించాలని నిరసన
దిలావర్‌పూర్: మండలంలోని సిర్గాపూర్ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న వైన్స్ షాప్‌ను వేరే ప్రాంతానికి తరలించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆదివారం వారు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన రహదారిపై పాఠశాలకు దగ్గర ఉన్న వైన్స్ షాప్ కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మందుబాబులు హల్‌చల్ చేస్తుండడంతో విద్యార్థినులు భయాందోళన చెందుతున్నారన్నారు. వైన్స్‌ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలన్నారు. మాజీ సర్పంచ్ గంగారెడ్డి, నరసింహారెడ్డి, విజయ్, కొండుగారి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.