
కేజీబీవీల నిర్వహణ ఎలా?
మంచిర్యాలఅర్బన్: కేజీబీవీల్లో నిర్వహణ భారంగా మారుతోంది. పౌష్టికాహారం, ఉచిత పాఠ్యపుస్తకా లు, నాణ్యమైన బోధన, వసతితో కూడిన విద్యతో మంచి ఫలితాలు రావడం.. విద్యార్థుల సీట్లు దొరక ని పరిస్థితి. ప్రభుత్వం వారికి పౌష్టికాహారం అందించేందుకు కొత్త మెనూ అమల్లోకి తెచ్చిన.. టెండర్ల ఖరారులో మాత్రం నిర్లిప్తిత చోటు చేసుకుంది. ఇది వరకు కాంట్రాక్టర్లు సరఫరా చేసిన సరుకులకు నెల ల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లుల చెల్లింపులకు ఒత్తిడి చేస్తుండగా.. నెలవారీ అవసరాలకు నిధుల్లేక నిర్వహణ స్పెషల్ ఆఫీసర్లకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వచ్చే వేతనాలు తక్కువంటే అందులో మెయింటెన్స్‌కు చేతి నుంచి పెట్టాల్సి వస్తుండటంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి.
టెండర్‌లో ఖరారులో తాత్సారం
కస్తూర్బాల్లో చదువుతున్న బాలికలకు ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలు పెంచింది. పౌష్టికాహారం కోసం చార్జీలు 6, 7 తరగతులకు రూ.1330, 8, 9, 10 తరగతులకు రూ.1540, ఇంటర్ చదివే బాలికలకు రూ. 2100 డైట్ చార్జీలు ఉన్నాయి. కాస్మెటిక్ చార్జీలు 6 నుంచి 8 వతరగతి వరకు రూ.100 నుంచి రూ.175, 8 నుంచి 10వ తరగతి ఆపై 11 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికి రూ.100 నుంచి రూ.275కు పెరిగాయి. ఈ విద్యాసంవత్స రం ప్రారంభమై నాలుగు నెలలు గడిచిపోయిన కొ త్తగా ఎగ్స్, పాలు టెండర్లు మాత్రం పూర్తి చేశారు. కూరగాయలు, నిత్యావసర సరుకులు, పండ్లు పాత టెండర్‌దారులతోనే నెట్టుకువస్తున్నారు. బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు సరుకులు నిలిపివేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తున్నాయి.
మెయింటెన్స్ గ్రాంటు లేక..
ఇదివరకు కేజీబీవీలో విద్యుత్ మరమ్మతు, ఫ్యాన్లు, ప్లంబర్, ఎలక్ట్రీషీయన్, తాగునీటి క్యాన్లు, స్టేషనరీ, రైస్, పుస్తకాల చేరివేతకు ట్రాన్స్‌పోర్టు, హమాలీ చార్జీలు పలు చెల్లింపులన్నీ స్పెషల్ ఆఫీసర్లు చెల్లించేవారు. ఇందుకు స్కూల్ అకౌంట్‌లో రూ.లక్ష వరకు ఎప్పటికి నిల్వ ఉండేవి. అత్యవసర అవసరాలు తీర్చుకునేందుకు వీలుండేది. ప్రస్తుతం నిర్వహణ నిధులు ఎస్‌వోల ఖాతాలో లేకపోవడంతో డైట్ చార్జీలు చెల్లించకపోవడం.. రోజువారీ అవసరాలు తడిసిమోపెడవుతున్నాయి. సిలిండర్లకు రూ.800 చొప్పున నెలకు దాదాపు రూ.25వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు పైమాట. అంతేకాకుండా వాటర్‌క్యాన్లు కొనుగోలు. స్టేషనరీ ఇతర ఖర్చులు అదనం. స్పెషల్ ఆఫీసర్లకు వచ్చే వేతనం రూ.32,500 కావటంతో అప్పు చేయక తప్పని పరిస్థితి. గతంలో మాదిరిగా స్కూల్ ఖాతాలో ఇంప్రెస్ట్ ఎమౌంట్ (నిర్వహణ నిధులు) రూ.లక్ష నుంచి రూ. 2 లక్షలు ఉంచితే నిర్వహణ సులభతరంగా మారనుంది. ఎస్‌వోలు ఖర్చుచేసినా డిజిటల్ పేమెంట్ చేయమంటున్నారు
రెండు రోజులుగా చెల్లింపు
కేజీబీవీల్లో సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన జూన్ సంబంధించిన డైట్ చార్జీలు మంజూరైంది. రెండు రోజుల నుంచి చెల్లింపులు సాగుతున్నాయి. జూలై, ఆగస్టు నెలకు సంబంధించి డైట్ బిల్లులు, నిర్వహణ నిధులు వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదించాం. నిధులు మంజూరు కాగానే చెల్లింపులు చేస్తాం.
– చౌదరి, ఎఫ్‌ఏవో (ఫైనాన్స్ అకౌంట్ ఆఫీసర్) మంచిర్యాల
బాలికలు
4587
కేజీబీవీలు
18

కేజీబీవీల నిర్వహణ ఎలా?