17న బాసరకు శృంగేరి పీఠాధిపతి | - | Sakshi
Sakshi News home page

17న బాసరకు శృంగేరి పీఠాధిపతి

Oct 13 2025 8:22 AM | Updated on Oct 13 2025 8:22 AM

17న బ

17న బాసరకు శృంగేరి పీఠాధిపతి

● గరిష్ట నీటిమట్టానికి ప్రాజెక్ట్‌

బాసర: శృంగేరి జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతి మహాస్వామి ఈనెల 17, 18,19 బాసరకు విచ్చేస్తున్నారని ఈవో అంజనాదేవి తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాదా య శాఖ ధార్మిక సలహాదారు గోవిందహరి ఆదివారం ప్రత్యేక ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర విజయ యాత్రలో భాగంగా ఆలయంలో పూజలు చేస్తారని పేర్కొన్నారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త శరత్‌ పాఠక్‌, ఏఈ వో, ఆలయ వైదిక కమిటీతో సమావేశం నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఆలయ వైదిక కమిటీ ఇంజనీరింగ్‌ విభాగ సిబ్బంది కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

‘కడెం’లో పర్యాటకుల సందడి

కడెం: కడెం ప్రాజెక్ట్‌ పరిసరాలు ఆదివారం ప ర్యాటకులతో సందడిగా మారాయి. వివిధ సు దూర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబ స భ్యులు, మిత్రబృందంతో ప్రాజెక్ట్‌ అందాలను తిలకించారు. అనంతరం బోటింగ్‌ చేశారు.

కడెం @ 700

కడెం: కడెం ప్రాజెక్ట్‌ గరిష్ట నీటిమట్టం 700 అ డుగులకు చేరింది. ప్రాజెక్ట్‌ నిండానీటితో కళకళాడుతుంది. గంగమ్మ ఆలయం వద్దకు, రిసార్ట్స్‌లోకి నీళ్లు చేరాయి. ఆదివారం సాయంత్రం ప్రాజెక్ట్‌కు 819 క్యూసెక్కుల స్వల్ఫ ఇన్‌ఫ్లో వస్తుంది. ఇన్‌ ఫ్లో పెరిగితే గేట్లు ఎత్తే అవకాశం ఉంది.

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ కార్యవర్గం

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ ఫి జికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ నూ తన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. ఉమ్మ డి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల క ళాశాలల ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడిగా జె.సోమన్న (ములుగు ప్రభు త్వ డిగ్రీ కళాశాల) ఎన్నికయ్యారు. ప్రధాన కా ర్యదర్శిగా కె.సునీల్‌రెడ్డి (బొల్లికుంట వీసీపీఈ ఫిజికల్‌ డైరెక్టర్‌), ఉపాధ్యక్షులుగా పి.అజయ్‌, ఎస్‌.కుమారస్వామి, బి.రమేశ్‌, జి.సునీత, కో శాధికారిగా ఎస్‌.కిరణ్‌కుమార్‌గౌడ్‌, సంయుక్త కార్యదర్శులుగా ఎం.కుమారస్వామి, కె.మధుకర్‌, బి.వెంకట్రామ్‌, జె.జేత్యాతోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా మహ్మద్‌ కరీం వ్యవహరించారు. నాలుగేళ్ల పాటు కార్యవర్గం కొనసాగుతుంది.

సునీల్‌రెడ్డి

సోమన్న

17న బాసరకు   శృంగేరి పీఠాధిపతి1
1/4

17న బాసరకు శృంగేరి పీఠాధిపతి

17న బాసరకు   శృంగేరి పీఠాధిపతి2
2/4

17న బాసరకు శృంగేరి పీఠాధిపతి

17న బాసరకు   శృంగేరి పీఠాధిపతి3
3/4

17న బాసరకు శృంగేరి పీఠాధిపతి

17న బాసరకు   శృంగేరి పీఠాధిపతి4
4/4

17న బాసరకు శృంగేరి పీఠాధిపతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement