
అ‘పూర్వ’సమ్మేళనం..
బెల్లంపల్లి సీఎస్‌ఐ ఉన్నత పాఠశాల (తె.మీ) 1988–89 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 37 ఏళ్ల తర్వాత నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి వారు హాజరయ్యారు. ఒకరికొకరు ఆత్మీయ ఆలింగనం అనంతరం యోగాక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉల్లాసంగా గడిపారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. పూర్వవిద్యార్థులు కటకం సతీశ్, ఎల్దండి రవీందర్, గోసిక రమేశ్, కుమారస్వామి, వంశీ, మధు తదితరులు పాల్గొన్నారు. – బెల్లంపల్లి
జుమ్మెరథపేట్ పాఠశాలలో..
జిల్లా కేంద్రంలోని జుమ్మెరథపేట్ ఉన్నత పాఠశాల 2008–09 బ్యాచ్ పదో తరగతి పూర్వవిద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. జిల్లాకేంద్రంలోని ఆర్‌ఆర్ గార్డెన్స్‌లో అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఉన్న అనుభవాలు పంచుకున్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. – నిర్మల్‌రూరల్

అ‘పూర్వ’సమ్మేళనం..