
చదువులు చెప్పలేం..
‘బెస్ట్ అవైలబుల్’ పాఠశాలలకు విడుదల కాని ఫీజు బకాయిలు విద్యార్థులను రావద్దంటున్న యాజమాన్యాలు ఆందోళనలో తల్లిదండ్రులు
ఇంద్రవెల్లి/ఉట్నూర్‌రూరల్/సాక్షి ఫొటోగ్రాఫర్, నిర్మల్: బెస్ట్ అవైలబుల్ ప్రైవేట్ పాఠశాలల్లోని పేద విద్యార్థుల చదువులకు ఫీజు బకాయిలు అడ్డుపడుతున్నాయి. పాఠశాలల యాజమాన్యాలకు ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులకు చదువులు చెప్పలేం.. పాఠశాలలకు రావద్దంటున్నారని యాజమాన్యాలు చెబుతున్నాయి. దసరా సెలవుల్లో ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు అక్కడే ఉంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని పొల్లుగూడ గ్రామానికి చెందిన ఆత్రం రిషి, మర్సుకోల ఆశ్విని, కొరెంగా భీంరావ్, కేస్లాగూడకు చెందిన చహకటి అంజలి, ఉట్నూర్‌లోని విద్యార్థులు, నిర్మల్ జిల్లా మామడ మండలం తోటిగూడ గ్రామానికి చెందిన పది మంది వివిధ ప్రాంతాల్లోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుతున్నారు. అయితే ఫీజులు కడితే బడికి రావాలని లేకపోతే వద్దని యాజమాన్యాలు చెబుతుండడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు రోజులుగా వెళ్లలేదు
ఫీజులు కడితేనే రావాలని లే దంటే పాఠశాలకు రావద్దని అంటున్నారు. రెండు రో జులుగా బడికి వెళ్లలేదు. పా ఠశాల ప్రారంభం నుంచి తల్లిదండ్రులు పుస్తకాలు కొని ఇచ్చారు. ఫీజు లు కట్టాలని పాఠశాల యాజమాన్యం అంటే చదువులు మధ్యలోనే ఆపాలి. ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలి.
–హన్విత, 6వ తరగతి, పులాజీబాబా పాఠశాల

చదువులు చెప్పలేం..