
చెరువులను పరిరక్షించాలి
గత కొన్ని దశాబ్దాలుగా బంగల్‌పేట్ చెరువులో స్విమ్మింగ్ చేస్తున్నాం. ఉదయం పూట గంటపాటు శ్రమించడం వల్ల శరీరం తేలికగా మారుతుంది. రోజంతా ఉల్లాసంగా ఉంటుంది. ప్రస్తుతం చెరువు పరిసర ప్రాంతాల్లో డంపింగ్ యార్డ్ వేయడం, వాటిని కాల్చడం వల్ల వచ్చే పొగతో చెరువు కాలుష్యంగా మారుతుంది. మున్సిపల్ అధికారులు సత్వరమే చెరువు పరిరక్షణ కోసం తగిన చర్యలు చేపట్టాలి. గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలకు గురి కాకుండా కట్టుదిట్టం చేయాలి.
– అర్కారి రాజేందర్, గాంఽధీనగర్, నిర్మల్