స్టాఫ్‌ సెలక్షన్‌ ఫలితాల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

స్టాఫ్‌ సెలక్షన్‌ ఫలితాల్లో ప్రతిభ

Oct 8 2025 6:31 AM | Updated on Oct 8 2025 6:31 AM

స్టాఫ

స్టాఫ్‌ సెలక్షన్‌ ఫలితాల్లో ప్రతిభ

● వరుసగా రెండు ఉద్యోగాలకు ఎంపిక ● ఖాతాలో నుంచి రూ.62,191 నగదు మాయం

● వరుసగా రెండు ఉద్యోగాలకు ఎంపిక

నిర్మల్‌ఖిల్లా: జిల్లా కేంద్రంలోని జీఎన్‌ఆర్‌ కాలనీకి చెందిన జే.భరత్‌ కుమార్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ఫలితాల్లో సత్తాచాటి కేంద్ర ప్రభుత్వ మిలిటరీ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ శాఖలో జూ నియర్‌ ఇంజినీర్‌గా ఎంపికయ్యాడు. జందే లక్ష్మి–స్వామి దంపతుల కుమారుడైన భరత్‌ కు మార్‌ హైదరాబాద్‌లో బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసి కొన్నేళ్లుగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. గత ఆగస్టులో ఆర్కియాలజీ శాఖలో కన్జర్వేషన్‌ అసిస్టెంట్‌గా ఎంపికై కర్ణాటక రాష్ట్రంలోని హంపి ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా సోమవారం విడుదలైన స్టాఫ్‌ సెలక్షన్‌ ఫలితాల్లో ఆలిండియా ఓబీసీ విభాగంలో 37వ ర్యాంకు సాధించాడు.

మరో సైబర్‌ మోసం

ఆదిలాబాద్‌టౌన్‌: రోజురోజుకూ సైబర్‌ మోసాలు పెరుగుతూనే ఉన్నాయి. తెలిసినప్పటికీ కొంతమంది వారి వలలో చిక్కుతున్నారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్‌ ఖాతా సమాచారం ఇవ్వవద్దని చెబుతున్నప్పటికీ పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు. తీరా డబ్బులు పోగొట్టుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు. ఇలాంటిదే జిల్లా కేంద్రంలోని పాత హౌజింగ్‌ బోర్డులో సంఘటన చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి గాలి ప్రవీణ్‌ కుమార్‌ గతనెల 26న తన స్నేహితుడికి ఫోన్‌పే ద్వారా రూ.3,900 నగదు పంపించాల్సి ఉండగా పొరపాటున మరోవ్యక్తికి ఆ డబ్బులు వెళ్లాయి. ఆ డబ్బులు తిరిగి రాబట్టుకునేందుకు గూగుల్‌లో సెర్చ్‌ చేశాడు. అందులో 7303238726 నంబర్‌కు ఫోన్‌ చేశాడు. రీఫండ్‌ చేస్తామని నమ్మించి నాలుగుసార్లు అతని ఖాతాలో నుంచి మొత్తం రూ.62,191 నగదు కాజేశారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించి వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశాడు. సీఐ సునీల్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

కుభీర్‌: మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణారెడ్డి తెలిపిన వివరాల మేరకు కుభీర్‌కు చెందిన ముచ్చిన్ల గణేశ్‌ (23) కొంతకాలంగా ఏపనీ చేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. ఈక్రమంలో మద్యానికి బానిసయ్యాడు. జీవితంపై విరక్తి చెంది సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూలేని సమయంలో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ముందుగా భైంసా ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి నిజమాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం మృతి చెందాడు. మృతునికి తల్లి, అక్క ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

స్టాఫ్‌ సెలక్షన్‌ ఫలితాల్లో ప్రతిభ1
1/2

స్టాఫ్‌ సెలక్షన్‌ ఫలితాల్లో ప్రతిభ

స్టాఫ్‌ సెలక్షన్‌ ఫలితాల్లో ప్రతిభ2
2/2

స్టాఫ్‌ సెలక్షన్‌ ఫలితాల్లో ప్రతిభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement