
స్వర్ణ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత
దిగువకు వెళ్తున్న వరదనీరు
మండలంలోని ఆయా గ్రామాలతో పాటు ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలో మంగళవారం తెల్లవారు జామున కురిసిన భారీ వర్షానికి అధికారులు స్వర్ణ ప్రాజెక్టు నాలుగు గేట్లను పైకెత్తి నీటిని దిగువకు వి డుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1183 అడుగులు కాగా అర్ధరాత్రి ఒక్కసారిగా ఇన్‌ఫ్లో 15,200ల క్యూసెక్కులు పెరగడంతో అధికారులు ఒక్కొక్కటి చొప్పున నాలుగు వరదగేట్లను పైకెత్తి దిగువకు అంతేమొత్తంలో నీటిని విడుదల చేశారు. – సారంగపూర్