
కళాకారులకు పెన్షన్ ఇవ్వాలి
దండేపల్లి: 60 ఏళ్లు దాటిన నాటక, భజన కళా కారులకు ప్రభుత్వం నెలకు రూ.6వేల పెన్షన్ ఇవ్వాలని నాటక, భజన కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటాచారి డిమాండ్ చేశా రు. మండలంలోని రెబ్బనపల్లిలో మండలంలోని వివిధ గ్రామాల కళాకారులతో ఆదివారం సమావేశమై మాట్లాడారు. సినిమాల రాకతో కళాకారులు ఉపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంజేశారు. ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో భజన కళాకారులకు నిత్య భజనలకు అనుమతినిచ్చి కనీస వేతనం ఇవ్వాలని కోరారు. సమస్యల పరిష్కారానికి కళాకారులంతా ఐక్యతతో ముందుకెళ్లాలని సూచించారు. అనంతరం రెబ్బనపల్లి, ముత్యంపేట, కొర్విచెల్మ, చింతపల్లి, కన్నెపల్లి, గూడెం, రంగంపల్లె, నంబాల, గ్రామాల కమిటీలు ఏర్పాటు చేశారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి రమేశ్‌చారి, ముత్యం మల్లేశ్, పింగళి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
తాండూర్‌లో జోరు వర్షం
తాండూర్: మండలంలో ఆదివారం జోరు వాన కురిసింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై దాదాపు రెండు గంటల పాటు వర్షం కురవడంతో కాలువలు పొంగి ప్రవహించాయి. భారీ వర్షం కురవడంతో పత్తి పంటకు తీవ్ర నష్టం కలిగే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కళాకారులకు పెన్షన్ ఇవ్వాలి