
● పందులు, దోమలకు ఆవాసాలు ● ఇబ్బందుల్లో సమీప నివాసాలవారు
ఓపెన్ ప్లాట్లు.. జనం పాట్లు
నస్పూర్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగల ఓపెన్ ప్లాట్లు చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు, మురుగునీటితో నిండి దోమలు, ఈగలు, పందులకు ఆవాసాలుగా మారాయి. ప్లాట్లు మురికి కూపాలను తలపిస్తున్నాయి. నస్పూర్‌లో ఐడీవోసీ భవన సముదాయం ఏర్పాటు కావడంతో జిల్లా కేంద్రం చుట్టు పక్కల భూములకు డిమాండ్ ఏర్పడింది. దీంతో చాలామంది వారి భవిష్యత్ అవసరాల కోసం ప్లాట్లు కొనుగోలు చేసి పెట్టుకున్నారు. భవి ష్యత్‌లో ఇళ్లు నిర్మించుకోవాలనేది వారి ఆలోచన. కొనుగోలు చేసిన ప్లాట్లకు ఎలాంటి రక్షణ గోడలు నిర్మించకుండా వదిలివేస్తున్నారు. దీంతో చుట్టుపక్కలవారు ఈ ఖాళీ ప్లాట్లను చెత్తకుండీలుగా విని యోగిస్తున్నారు. తమ ఇళ్లల్లోని చెత్తను ఖాళీ ప్లాట్ల లో పడవేస్తున్నారు. పట్టణంలో చాలాచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన వెంచర్లలోనే ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేశారు. సదరు ప్లా ట్లలో ఇళ్లు నిర్మించుకున్న వారికి సరైన డ్రెయినేజీలు లేకపోవడంతో మురుగునీరంతా ఓపెన్ ప్లాట్లలోకి చేరుతోంది. దీంతో కాలనీల్లో పలువురి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ప్లాట్ల చుట్టూ ఎలాంటి రక్షణ గోడలు ఏర్పాటు చేయకపోవడంతో వాటిలో పిచ్చిమొక్కలు పెరిగి తొలగించడం కష్టతరమవుతోంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని చాలా కాలనీల్లో దాదాపు ఇదే దుస్థితి నెలకొంది. ఖాళీ ప్లాట్లలో మురుగునీరు, పిచ్చిమొక్కలు ఉండడంతో దోమలు, ఈగలు పెరిగిపోతున్నాయి. ప్లా ట్లను పందులు తమ ఆవాసాలుగా మార్చుకున్నా యి. వీటి ద్వారా పలువురు రోగాల బారిన పడుతున్నారు. ఎలాంటి రక్షణ గోడలు నిర్మించని ప్లాట్ల యజమానులను గుర్తించి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసి జరిమానా విధించాలని పలువురు పట్టణ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రక్షణ గోడలు నిర్మించని ప్లాట్ల యజమా నులపై మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వాటితో ఇబ్బంది పడుతున్న పట్టణవాసులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

● పందులు, దోమలకు ఆవాసాలు ● ఇబ్బందుల్లో సమీప నివాసాలవారు