
కథల ద్వారా బోధన..
ఇంగ్లిష్ భాషను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడం, చదవడానికి వీలుగా టీఎల్‌ఎం తయారు చేశాను. పలు పాఠాలను నా వాయిస్ ద్వారా రికార్డు చేశాను. ఒక డివైస్‌తో విద్యార్థులకు వినిపించేలా తయారు చేశాను. ఈ కథలకు సంబంధించిన బొమ్మలు, కథానుసారంగా ప్రదర్శన ఉండడంతో సులువుగా అర్థం చేసుకుంటారు. ఒకటికి పదిసార్లు వినడంతో కఠిన పదాలు మదిలో గుర్తుండిపోతాయి. నారేటీవ్ బేస్డ్ ఇంగ్లిష్ అనే అంశంపై ప్రదర్శించాను. – ఎ.శ్రీనివాస్,
ఎంపీపీఎస్ గోండుగూడ, ఉట్నూర్