కార్మికులు, యాజమాన్యానికి వారధిగా యూనియన్‌ | - | Sakshi
Sakshi News home page

కార్మికులు, యాజమాన్యానికి వారధిగా యూనియన్‌

Oct 4 2025 2:16 AM | Updated on Oct 4 2025 2:16 AM

కార్మికులు, యాజమాన్యానికి వారధిగా యూనియన్‌

కార్మికులు, యాజమాన్యానికి వారధిగా యూనియన్‌

కాసిపేట: కార్మికులు, ప్రజలు, యాజమాన్యానికి వారధిగా యూనియన్‌ పని చేస్తుందని దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపనీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు సత్యపాల్‌రావు తెలిపారు. కంపెనీ తరఫున సమీప గ్రామాల ప్రజలకు సేవలందించేందుకు అంబులెన్స్‌ను గురువారం ప్రారంభించారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా బోనస్‌ రూ.4వేలు పెంచినట్లు తెలిపారు. ఒకేసారి 26క్వార్టర్లు అర్హులకు ఇప్పించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సతీష్‌రెడ్డి, మెరుగు శంకర్‌, నాయకులు జనార్థన్‌, అబ్ధుల్‌ సత్తర్‌, కొమ్ముల బాపు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement