
జన్నారం ఇంచార్జి రేంజ్ అధికారిగా మమత
జన్నారం: జన్నా రం అటవీ డివిజన్‌లో ల్యాండ్ అండ్ రి కార్డు సర్వే డీఆర్వోగా విధులు నిర్వర్తి స్తున్న మమత జన్నారం ఇంచార్జి రేంజ్ అధికారిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్ని రోజులు తాళ్లపేట్ రేంజ్ అధికారి సుష్మారావుకు ఇంచార్జి బాధ్యతలు ఇచ్చారు. డివిజన్‌లో జరుగుతున్న పరిణామా ల దృష్ట్యా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు జన్నారం ఎఫ్‌డీవో రామ్మోహన్ మమతకు బాధ్యతలు ఇచ్చారు. ఈ మేరకు గురువారం రేంజ్ కార్యాలయంలో ఆమె బాధ్యతలు చేపట్టారు. తనకు ఉన్నతాధికారులు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు.