
వాగుకు చేపలకు వేటకు వెళ్లి ఒకరు..
తానూరు: చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దామాజీ సాయినాథ్ (40) ఈ నెల 1న చేపలు పట్టేందుకు సింగన్‌గాం సమీపంలోని వాగుకు వెళ్లి రెండు రోజులైనా తిరిగి రాలేదు. బంధువుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబ సభ్యులు భావించారు. ఆ మార్గంలో వెళ్తున్న కొంతమంది నీటిలో తేలిన మృతదేహాన్ని పరిశీలించి పోలీసుల కు సమాచారం ఇవ్వగా ఎస్సై ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. తానూరువాసులు దామాజీ సా యినాథ్‌గా గుర్తించారు. మృతుడి భార్య రేణుక ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.