
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
బాసర: బాసరలో శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు పదో రోజు మహా సరస్వతి అలంకరణలో భక్తులకు దర్శనమి చ్చారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్‌లో బారులుతీరా రు. తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో ఆలయ వైదిక బృందం నవ చండీ హోమం, పూర్ణహుతి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సరస్వతి, మహాలక్ష్మి, మహంకాళి అమ్మవార్లకు మహాభిషేకము, అలంకరణ పూజలు చేశారు. సాయంత్రం చతుషష్టి పూజలు నిర్వహించారు.