
వన్యప్రాణులను వేటాడితే కఠిన చర్యలు
చెన్నూర్‌రూరల్: విద్యుత్ తీగలు అమర్చి అటవీ జంతువులను వేటాడితే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ డివిజన్ అధికారి కె.సర్వేశ్వర్ హెచ్చరించారు. మండలంలోని ఒత్కులపల్లి, కొత్తపల్లి గ్రామాల సమీపాల్లోని అటవీ ప్రాంతంలో కొంద రు గుర్తు తెలియని వ్యక్తులు వన్యప్రాణుల కోసం విద్యుత్ తీగలు అమర్చారని బుధవారం రాత్రి అందిన పక్కా సమాచారం మేరకు అటవీ సిబ్బందితో కలిసి వెళ్లి విద్యుత్ తీగలను తొలగించారు. ఆయన మాట్లాడుతూ విద్యుత్ తీగలు ఎవరు అమర్చారో విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామన్నా రు. అటవీ జంతువులను వేటాడినా, వాటి అవాసాలకు ముప్పు తలపెట్టినా, ఉరులు, ఉచ్చులు పెట్టినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వేమనపల్లి: వన్యప్రాణుల వేట కోసం అటవీ సరిహద్దుల వెంట విద్యుత్ ఉచ్చులు అమర్చటం ప్రమాదకరమని నీల్వాయి అటవీ రేంజ్ అధికారి హఫీజొద్దీన్ అన్నారు. బుధవారం అటవీ రేంజ్ పరిధిలోకి వచ్చే కల్మలపేట, చామనపల్లి, బద్దంపల్లి ఇతర గ్రామాల్లో వన్యప్రాణుల వేట వల్ల కలిగే అనర్థాలను వివరించారు. కార్యక్రమంలో డీఆర్వో ప్రమోద్‌కుమార్ ఎఫ్‌బీవోలు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.