
పంచాయతీ ఎన్నికల విడతలు మారాయి..
మంచిర్యాలరూరల్(హాజీపూర్): జిల్లాలోని గ్రామ పంచాయతీ ఎన్నికల మూడు విడతల్లో నిర్వహణకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. అక్టోబర్ 31న మొదటి విడత, నవంబర్ 4న రెండో విడత, నవంబర్ 8న మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్ కుమార్ దీపక్, జెడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్‌రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నికల కమిషన్ మూడు విడతల్లోని మండలాలను కొంత మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మూడో విడతల్లోనే ఎన్నికలు జరుగనుండగా.. ఎన్నికలు జరిగే మండలాలు మారాయి. మూడో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉన్న మండలాలు మొదటి విడతలోకి రాగా.. రెండో విడతలోని మండలాలు మూడో విడతలోకి, మొదటి విడతలో ఉన్న మండలాల్లో మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి.